Wednesday 2 March 2016

How to get respect from your kids?


తండ్రి లేదా తల్లి అంటే పిల్లలకు ఉండవలసింది భయం కాదు - గౌరవం, ప్రేమ. పిల్లలు మీరు చెప్పిన మాట వినడం లేదు అంటే వాళ్ళకి మీ పైన ఉండవలసినంత గౌరవం లేదు అని అర్థం. దానిని వాళ్ళనుంచి పొందడం ఎలా? గౌరవాన్ని ఇంగ్లిష్‌లో రెస్పెక్ట్ అంటారని మీకు తెలుసు కదా? రెస్పెక్ట్ అనే మాటలో ఒక్కో అక్షరానికీ ఒక్కో పాయింట్ని చెప్పి పిల్లలనుంచి గౌరవాన్ని పొందడం గురించి ఏడు సూత్రాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బి.వి. పట్టాభిరాం తన పుస్తకంలో వివరించారు. అవి ఏమిటో మీరుకూడా చూడండి.  

R - Role Model
E - Emotional Support/ Encouragement
S - Stress Reduction
P - Praising
E - Energizing
C - Comparison
T - Trust

మీ పిల్లలకి మీరే రోల్ మోడల్‌గా ఉండాలి. వాళ్ళని అబద్దం చెప్పొద్దని చెప్పాలంటే, ముందు మీరు కచ్చితంగా అబ్బదం చెప్పకుండా ఉండేవాళ్ళు అయి ఉండాలి. మీ పిల్లలు అధిక సిలబస్‌తో వొత్తిడి ఫీలవుతున్నప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, వొత్తిడి తగ్గించేలా మాట్లాడండి. మంచి పని చేస్తే అభినందించండి. మంచి బలాన్నిచే ఆహారాన్ని ఇవ్వండి. విజయం సాధించిన వాళ్ళలో మంచి గుణాలని మీ పిల్లల్లో ఉండే మంచి గుణాలతో సరిపోల్చి చూపించండి. కృషిచేస్తే నువ్వుకూడా అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళవచ్చు అనే మంచి మాటలు చెప్పండి. వాళ్ళు ఉన్నతమైన లక్ష్యాలను సాధించగలరని మనస్పూర్తిగా నమ్మండి. 

ఇలా చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు. ప్రేమిస్తారు. 
Related Posts Plugin for WordPress, Blogger...