బ్లేక్‌బోర్డు, టీచర్ మొఖం, చదువుతున్న పుస్తకంలో పేజీలూ తప్పించి... పచ్చని మొక్కలు, గాలికి అల్లల్లాడుతున్న లేత ఆకులు, నీటి గలగలల శబ్దం, అప్పుడప్పుడూ కువకువమని ఎగిరే పిచ్చుకల సందడి... ఏవీ అనుభవమవ్వడం లేదు ఇప్పటి విద్యార్థులకి. అటువంటి లోటు క్షేత్ర స్కూల్ పిల్లలకి ఉండకూడదని కొంచెం కష్టమైనా మొదటి, రెండవ ఫ్లోర్‌లలో అందమైన మొక్కలు, పచ్చికలతో చక్కని గార్డెన్ ఏర్పాటు చేశాం. చిన్న నీటి పాత్ర, మురళీ వాయిస్తున్న వేణుగోపాలుడి విగ్రహం గార్డెన్ ఏంబియన్స్‌ని చక్కగా ఎలివేట్ చేశాయి. తూర్పువైపు క్లాస్‌రూముల్లో సూర్యకిరణాలు పడే చోటులో తరగతికి రెండేసి పాం రకపు మొక్కలని ఉంచాం. తరగతి గదుల్లో గాలి రీసైకిల్ కావడానికి ఈ ఏర్పాటు ఎంతో సహాయపడుతుంది. ఆగస్టు పదిహేనవ తారీకున గార్డెన్‌ని చూసిన విద్యార్థులూ, వాళ్ళ తల్లితండ్రులూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. క్షేత్ర స్కూల్‌లో గార్డెన్ ఫోటోలు కొన్ని మీకోసం...
Monday, 5 September 2016
Wednesday, 11 May 2016
వర్షంలో విన్నీ-ద-పూ
ఎండలు మండిపోతున్నాయి.
ఉక్కబోస్తున్న మధ్యాహ్నంవేళ ఎక్కడినుంచో కరిమబ్బులు కమ్ముకొనివచ్చి
చిటపట చినుకులతో వర్షం మొదలైతే భలేగా ఉంటుంది కదూ?
తొలకరి జల్లులు తెచ్చే మట్టివాసన ఎంతో బాగుంటుంది, అవునా?
చిన్న చిన్న చినుకులు పెద్ద జడివానగా మారి కుంభవృష్టిగా మారినా ఆనందమే.
విన్నీలా తడవకూడనివన్నీ చంకనెత్తుకొని చెట్టుకొమ్మల్లో దాక్కోవచ్చు.
లేదంటే ఇంటిలో కూర్చొని కురిసే వర్షాన్ని చూస్తూ ఆనందించవచ్చు.
Wednesday, 2 March 2016
How to get respect from your kids?
R - Role Model
E - Emotional Support/ Encouragement
S - Stress Reduction
P - Praising
E - Energizing
C - Comparison
T - Trust
మీ పిల్లలకి మీరే రోల్ మోడల్‌గా ఉండాలి. వాళ్ళని అబద్దం చెప్పొద్దని చెప్పాలంటే, ముందు మీరు కచ్చితంగా అబ్బదం చెప్పకుండా ఉండేవాళ్ళు అయి ఉండాలి. మీ పిల్లలు అధిక సిలబస్‌తో వొత్తిడి ఫీలవుతున్నప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, వొత్తిడి తగ్గించేలా మాట్లాడండి. మంచి పని చేస్తే అభినందించండి. మంచి బలాన్నిచే ఆహారాన్ని ఇవ్వండి. విజయం సాధించిన వాళ్ళలో మంచి గుణాలని మీ పిల్లల్లో ఉండే మంచి గుణాలతో సరిపోల్చి చూపించండి. కృషిచేస్తే నువ్వుకూడా అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళవచ్చు అనే మంచి మాటలు చెప్పండి. వాళ్ళు ఉన్నతమైన లక్ష్యాలను సాధించగలరని మనస్పూర్తిగా నమ్మండి.
ఇలా చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు. ప్రేమిస్తారు.
Subscribe to:
Posts (Atom)





