బ్లేక్‌బోర్డు, టీచర్ మొఖం, చదువుతున్న పుస్తకంలో పేజీలూ తప్పించి... పచ్చని మొక్కలు, గాలికి అల్లల్లాడుతున్న లేత ఆకులు, నీటి గలగలల శబ్దం, అప్పుడప్పుడూ కువకువమని ఎగిరే పిచ్చుకల సందడి... ఏవీ అనుభవమవ్వడం లేదు ఇప్పటి విద్యార్థులకి. అటువంటి లోటు క్షేత్ర స్కూల్ పిల్లలకి ఉండకూడదని కొంచెం కష్టమైనా మొదటి, రెండవ ఫ్లోర్‌లలో అందమైన మొక్కలు, పచ్చికలతో చక్కని గార్డెన్ ఏర్పాటు చేశాం. చిన్న నీటి పాత్ర, మురళీ వాయిస్తున్న వేణుగోపాలుడి విగ్రహం గార్డెన్ ఏంబియన్స్‌ని చక్కగా ఎలివేట్ చేశాయి. తూర్పువైపు క్లాస్‌రూముల్లో సూర్యకిరణాలు పడే చోటులో తరగతికి రెండేసి పాం రకపు మొక్కలని ఉంచాం. తరగతి గదుల్లో గాలి రీసైకిల్ కావడానికి ఈ ఏర్పాటు ఎంతో సహాయపడుతుంది. ఆగస్టు పదిహేనవ తారీకున గార్డెన్‌ని చూసిన విద్యార్థులూ, వాళ్ళ తల్లితండ్రులూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. క్షేత్ర స్కూల్‌లో గార్డెన్ ఫోటోలు కొన్ని మీకోసం...
No comments:
Post a Comment