Friday 17 November 2017

ఫెయిరీస్

ఇంగ్లిష్ జానపద సాహిత్యంలో ఫెయిరీలకు చాలా ప్రాముఖ్యం ఉంది. సీతాకోక చిలుక రెక్కల లాంటి రెక్కలు కలిగిఉండి, గాలిలో ఎగురగలిగి, మనుష్యుల రూపంలో ఉండే శక్తులని ఫెయిరీలని అంటారు. వీటి చేతులలో మంత్రదండాల్లాంటి మ్యాజిక్ వ్యాండ్‌లు కూడా ఉంటాయి. ఫెయిరీలు మాయలు చెయ్యగలవు; కావాలనుకొంటే వాటి చిలిపి పనులతో మనుష్యులను ముప్పుతిప్పలు పెట్టగలవు. ఇంగ్లిష్‌లో మన చందమామ కథల్లాంటి ఫెయిరీ టేల్స్ ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఫెయిరీలు నిద్రపోతున్నవాళ్ళని ఎత్తుకొనిపోయి, ఎక్కడో దించెయ్యడం... జుట్టూ, జుట్టూ ముడిపెట్టడం... అడవుల్లో, కొండల్లో, ఎడారులలో ప్రయాణించేవాళ్ళని దారి తప్పేలా చెయ్యడం... లాంటి పనులు చేస్తూ మనల్ని నవ్విస్తాయి లేదా కథల్లో ముఖ్యమైన మలుపులకు కారణం అవుతాయి. వాటికి చల్లని ఇనుపముక్కలన్నా, బ్రెడ్‌ముక్కలన్నా చాలా భయమట. అందువల్ల వాటి బారిన పడకుండా ఉండడానికి జనాలు వాటిల్ని తమవెంట ఉంచుకొంటారట. నిజానికి ఫెయిరీలు చెడ్డవి ఏమీ కాదు. కాకపోతే వాటికి కొంచెం చిలిపితనం ఎక్కువ అంతే!   

ఫ్యాన్సీడ్రెస్ కాంపిటీషన్లు జరుగుతున్నప్పుడు కృష్ణుడు, రాధా లాంటి వేషాలు వెయ్యడం ఎంత సాధారణమో... ఫెయిరీ వేషం వెయ్యడం కూడా అంతే సాధారణం. ఇది చాలా పాపులర్ కల్చర్. 

మొన్న చిల్డ్రెన్స్ డే నాడు, క్షేత్ర స్కూల్‌లో జరిగిన ఫ్యాన్సీ డ్రెస్ ఈవెంట్‌లో పాల్గొన్న మా ఎల్కేజీ, యూకేజీ చిన్నారులు. 

క్రింద కనిపిస్తున్న నలుగురు చిన్నారులలో ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. అదెవరో కనిపెట్టగలరేమో చూడండి. 




3 comments:

Related Posts Plugin for WordPress, Blogger...