Tuesday 21 November 2017

విద్యాబుద్ధులు నేర్చుకోవాలని ఎందుకు అంటారు?

విద్య ఒక్కటే నేర్చుకొంటే దానికి విలువ ఉండదు. విద్యతోపాటూ మంచి బుద్ధులు కూడా ఉండాలి. అప్పుడే నేర్పేదానికి, నేర్చుకొనేదానికీ సార్ధకత. రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకొని పోయినతరువాత, సీతాన్వేషణలో హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరుతాడు. సీతాదేవికి రాముని ముద్రిక చూపించి, స్వాంతన చేకూర్చే సందేశం వినిపించిన తరువాత, లంకా దహనం చేసి.. రావణుని సభకు వెళతాడు. అప్పుడు హనుమంతుడు రావణుడితో పలికిన మాటలు `విద్యాబుద్ధుల` యొక్క ప్రాముఖ్యతని తెలుపుతాయి. 
Photo taken at fancy dress event held at
Kshetra School on Children`s Day
 హనుమంతుడు ఏమంటాడంటే...

`ఓ రావణా సర్వశాస్త్రాలూ చదివిన నువ్వూ, రాముడూ విద్య విషయంలో సరిసమానులే.. కానీ, పరాయివాడి భార్యని అపహరించి తీసుకొని రావడం తప్పు అనే బుద్ధి నీకు లేకపోయింది కనుక నీవు నేర్చుకొన్న విద్యకి విలువ లేకుండా పోయింది. సర్వశాస్త్రపారంగతుడవైన నీకు  దుర్మార్గుడనే పేరు మిగులుతుంది.` 

అందుకే ఎవరైనా సరే విద్యాబుద్ధులు రెండు నేర్చుకోవాలి. 

హనుమంతుడు చెప్పే గొప్ప నీతి అదే! 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...