Thursday 16 November 2017

ఒక్కో చినుకునీ వొడిసిపట్టు..

జీవజాలం మనుగడకి నీరు చాలా ప్రధానమైన వనరు. నదుల్లో ప్రవహిస్తున్న నీరు, చెరువుల్లో నిండుగా ఉన్న నీరు, భూగర్బం నుంచి నూతులద్వారా, బోరులద్వారా వెలికి తీస్తున్న నీరు... మన అందరి అవసరాలకీ నిరంతరం సరిపోతుందిలే... అనుకొంటే చాలా పొరపాటు పడినట్టే. పెరుగుతున్న జనాభా అవసరాలకోసం విచ్చలవిడిగా వినియోగించడం వల్ల భూగర్భ జలాల శాతం  గణనీయంగా తగ్గుతున్న విషయాన్ని అధ్యాయనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టే ఆ నీటి శాతాన్ని పెంచవలసిన బాధ్యత మనందరిమీదా ఉంది. కురుస్తున్న ప్రతీ వర్షపు చుక్కన్నీ వృధాపోనీయకుండా వొడిసిపట్టుకొని ఇంకుడుకుంతల్లోనికి... అక్కడినుండి భూగర్భంలోనికి పంపించాలని సందేశమిస్తూ... యూకేజీ అబ్బాయి... మిథిలేష్ వర్మ.   
(At the fancy dress event held in Kshetra School 
on the occasion of Children`s Day)

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...