Wednesday 22 November 2017

హెల్త్ ఈజ్ వెల్త్

వెంకట రాజిన్ డాక్టర్‌గారి దగ్గరకి వెళ్ళాడు. అమ్మా, నాన్నా ఏమీ తినొద్దంటున్నారనీ.. అందుకే చాలా నీరసం వచ్చేస్తుందనీ కంప్లైంట్. ఏమైన టానిక్కులు ఇవ్వమని అడిగాడు. 


డాక్టరు ఆశ్చర్యపోయింది. `అమ్మా, నాన్నా బ్రతిమాలి తినిపిస్తారు కానీ, ఎక్కడైనా తినద్దంటారా!? `కొంచం వివరంగా చెప్పు,` అంది.

`ఓ రోజు సినిమాకి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్‌లో సమోసాలు తింటానంటే వద్దన్నారు. కనీసం ఐస్‌క్రీం అన్నా కొనిపెడతారనుకొంటే - శీతాకాలంలో ఐస్క్రీంలూ, కూల్‌డ్రింకులూ తీసుకొంటే జలుబుచేస్తుందీ - టాట్, కాదూ, కూడదూ అన్నారు. రోడ్డుప్రక్కన బండిమీద బజ్జీలు, నూడుల్స్, పిజ్జాలు, చిప్స్ పేకెట్లు, చాక్లేట్లు... ఏమీ తిననివ్వడం లేదు` అని చెపుతూ గొల్లుమన్నాడు.  

ప్రతీ పిల్లవాడి తల్లితండ్రులూ అలా ఉంటే.. రోగాల పాలుచేసే జంక్‌ఫుడ్ జోలికి వెళ్ళకుండా పిల్లలని అదుపుచేయగలిగితే ఎంతో బాగుంటుందని డాక్టరుకి అనిపించింది.

కానీ, ఏమీ తిననివ్వకపోతే ఇంకెలా బ్రతకాలని ఆ కుర్రాడు గోలపెట్టేస్తున్నాడు. 

అప్పుడు డాక్టర్-

`నువ్వు అడిగిన ఆహార పదార్ధాలు ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి. అజీర్తి చెయ్యడం, జ్వరాలు రావడమేకాకుండా... ప్రతీరోజూ తింటే ప్రమాదకరమైన ప్రాణాంతక రోగాలను కలుగజేస్తాయి. కాబట్టి వాటికి బదులుగా ఆరోగ్యాన్ని కలుగజేసే తాజా పండ్లు, కాయగూరలు తినాలి అని, అమ్మవండిన ఆహారపదార్థాలు అనారోగ్యం కలిగించవనీ` చెప్పింది.

జామ, నారింజ, బత్తాయి, నిమ్మ కాయల్లో, ద్రాక్ష పళ్ళలో;
కాలీఫ్లవర్, టమాటో, బంగాళాదుంప లాంటి కాయగూరల్లో
సి విటమిన్ లభిస్తుంది.
సి విటమిన్ మనల్ని జలుబు నుంచి రక్షిస్తుంది,
ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది,
మెదడు శక్తిసామర్ధ్యాలను పెంచుతుంది. 

కేరెట్ లాంటి దుంపల్లో,
ఆకుకూరల్లో, బొప్పయి పండులో, పాలల్లో, గ్రుడ్లలో..
విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది.
కళ్ళ ఆరొగ్యం బాగుండడానికి,
పిల్లలలో ఎదుగుదలకు, రోగనిరోదక శక్తి పెరగడానికి
ఎ విటిమిన్ ఎంతో అవసరం. 

పండ్లు, కాయగూరలు తినడం వల్ల శరీరానికి లభించే పోషక విలువలు, మనలో పెరిగే రోగనిరోదకశక్తీ మొదలైన వాటిని గురించి వివరించి చెప్పిన తరువాత రాజిన్‌కి విషయం అర్థమయ్యింది. తాను తెలుసుకొన్న సంగతులని అమ్మా, నాన్నలకి చెప్పడానికి ఆనందంగా ఇంటిముఖం పట్టాడు.  

(Photos taken at Kshetra School during Children`s Day Celebrations)

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...