Monday 27 November 2017

మొత్తానికి అలా జరిగిందన్న మాట...

జీన్స్‌పేంట్‌లోకి ఫుల్‌స్లీవ్స్ షర్ట్ టక్ చేసి, దానిమీద స్లీవ్‌లెస్ జాకెట్ వేసుకొని, కలర్స్-కలర్స్ షూ తొడుక్కొని, నెత్తిమీద హ్యాటు, కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని, మెషీన్‌గన్ తీసుకొని యస్వంత్ బయలుదేరుతుంటే - ప్రవల్లిక వచ్చింది. `ఇంత లేటయ్యిందేమి? మనవాళ్ళందరూ వచ్చేశారా?` అన్నాడు.

`అదిగో బయటే వెయిట్ చేస్తున్నారు. నువ్వు వస్తే వెళదాం,` అంది.

రోజూ ఒకే రకమైన యూనీఫాం వేసుకొని బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి. అందుకే ఈ రోజు వాళ్ళు చదువుతున్న క్షేత్రస్కూల్‌లో ఫ్యాన్సీ డ్రెస్ ఈవెంట్ ఉందని రకరకాల  డ్రెస్సుల్లో తయారయి, కబుర్లు చెప్పుకొంటూ స్కూల్‌కి వచ్చేశారు.

కొంతమంది ఫ్రూట్స్‌లాగ, ఇంకొందరు ఫ్లవర్స్‌లాగా మేకప్పులు చేసుకొన్నారు. నెహ్రూ, మోడీ, క్రిస్మస్‌తాత, రాధాకృష్ణులు, డాక్టర్, ఫెయిరీస్, కోయదొర, పంతులుగారు, బాల హనుమంతుడు, మిలటరీ జవాన్లు, పోలీస్ ఇన్స్పెక్టర్లు... లాంటి వేషాలు వేసుకొన్నారు చాలా మంది పిల్లలు. 
అందరూ భలేగా ఉన్నారు. ఒకరిని ఒకరు `నీ డ్రెస్ బాగుందంటే... నీ డ్రెస్ బాగుందని` మెచ్చుకొన్నారు. `నా డ్రెస్ ఎలా ఉంది?` అని అడిగి `చాలా బాగుంది` అని చెప్పించుకొన్నారు. కానీ, సహస్ర వేసిన వేషం చూసి మాత్రం అందరికీ కళ్ళవెంట నీళ్ళు వచ్చేశాయి. `సేవ్ ద గాల్ చైల్డ్` అట. 
అమ్మ లేకపోతే ఎవరైనా ఉంటారా? చెల్లి, అక్కా ఉంటే అన్నదమ్ముల్ని ఎంత ప్రేమగా చూసుకొంటారు. కానీ కొంతమంది చేసే పనులవల్ల అమ్మాయిలే లేకుండా పోయే పరిస్థితి రావచ్చని జడ్జీలు మాట్లాడారు. అందుకే అందరూ చేయీ, చేయీ కలిపి ప్రతిజ్ఞ చెయ్యాలి `సేవ్ ద గాల్ చైల్డ్` అని.  
మొత్తానికి ఫాన్సీ డ్రెస్ ఈవెంట్ చాలా బాగా జరిగింది. అందరూ ఆనందంగా ఇంటి ముఖం పట్టారు. ఇకపోతే `ప్రైజులు ఎవరికి వస్తాయో!` అని చిన్న ఆత్రుత అంతే!

ఈ పిల్లల్లో మీకు ఎవరు నచ్చారు?

ఇంతకు ముందు ఈ ఈవెంట్ గురించి వ్రాసిన పోస్ట్‌లు ఈ క్రింది టైటిల్స్‌మీద క్లిక్ చేసి చదవండి. అప్పుడు డిసైడ్ చెయ్యండి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...