Tuesday, 6 September 2016

Eco Ganesha 2016

వినాయక చవితి - ఇంటిలో వినాయక వ్రతం చేసుకోవడం, కూడలి కూడలికీ వినాయక పందిళ్ళల్లో ఆకర్షణీయమైన వినాయక ప్రతిమలని నిలబెట్టడం, తొమ్మిదిరోజుల కోలాహలం, చివరిరోజు వినాయక నిమజ్జనం... పండుగ కోలాహలం ఎంతో బాగుంటుంది. కానీ ప్లాస్టరాఫ్ పారిస్‌తో తయారుచేసి, రసాయనిక రంగులు అద్దిన ప్రతిమలని నిమజ్జనం చెయ్యడం వల్ల నీటి కాలుష్యం జరుగుతుందని పర్యావరణ వేత్తలు చెపుతూ వస్తున్నారు. దీనివల్ల మట్టితో ప్రతిమలు తయారుచెయ్యడానికి ప్రాముఖ్యత పెరిగింది. `మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం` అనే నినాదం ఊపందుకొంది. `నేను సైతం` అన్నట్టు... మన క్షేత్ర స్కూల్ కూడా విద్యార్థుల్లో అవగాహన పెంచడానికి `ఎకో గణేశా` కార్యక్రమాన్ని నిర్వహించింది.

నాణ్యమైన నల్ల మట్టిని తెప్పించి, వినాయక ప్రతిమలని ఎలా తయారు చెయ్యాలో విద్యార్థులకి నేర్పించి, బొమ్మలు చెయ్యడానికి స్థలాన్ని కేటాయించి... ది స్పిరిట్ ఆఫ్ మేకింగ్ వినాయకా ని వాళ్ళల్లో నింపడం జరిగింది. ఏకాగ్రతతో క్షేత్రా స్కూల్ చిన్నారులు బుజ్జి, బుజ్జి వినాయకులని తయారు చెయ్యడం చూస్తుంటే ముచ్చటేసింది. కావాలంటే మీరూ చూడండి.



























Teachers` Day 2016

1952 నుంచి 1962 వరకూ స్వతంత్ర్య భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, ఆ తరువాత 1962 నుంచి 1967 వరకూ రెండవ రాష్ట్రపతిగా ఉన్న శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప రాజనీతిజ్ఞుడే కాక భారతదేశ తత్వశాస్త్రాన్ని ఔపోశన పట్టిన పండితుడు కూడా. అద్వైత వేదాంతం గురించి ఎన్నో గ్రంధాలు వ్రాశారు ఈయన. 1954లో రాధాకృష్ణన్‌కు భారతరత్న పురస్కారం లభించింది. ఇదేకాక ఆయన జీవితకాలంలో ఎన్నో సత్కారాలు అందుకొన్నారు. రాధాకృష్ణన్ రాష్ట్రపతి అయిన తరువాత ఆయన విద్యార్థులూ, అభిమానులూ రాధాకృష్ణన్ పుట్టినరోజుని జరుపుతామని కోరినప్పుడు, `సెప్టెంబర్ 5 వ తారీకుని నా పుట్టిన రోజుగా కాకుండా ఉపాద్యాయ దినోత్సవంగా జరుపుకొంటే నాకు సంతోషం,` "Instead of celebrating my birthday, it would be my proud privilege if September 5th is observed as Teachers' Day." అని అన్నారట. అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం ఆ తారీకు నాడు ఉపాద్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. తెలుగు బ్రాహ్మణుల ఇంట జన్మించిన రాధాకృష్ణన్ అంతర్జాతీయ ఖ్యాతిని అందుకోవడం తెలుగు వాళ్ళగా మనందరికీ కూడా ఎంతో గర్వకారణం.  
*          *          *
ఈ సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీకు వినాయక చవితి కావడంతో స్కూల్‌కి శలవు. అందుకే సెప్టెంబర్ 6న క్షేత్ర స్కూల్ ఉపాద్యాయినీ ఉపాద్యాయులకి విద్యార్థుల చేతుల మీదుగా సత్కారం అందించడం జరిగింది. సెప్టెంబర్ 5 యొక్క ప్రత్యేకత, సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత విశేషాలూ, గురువుల యొక్క గొప్పతనం ప్రతీ విద్యార్థికీ తెలియాచేసే ప్రయత్నం జరిగింది.   
*          *          *

Teachers who love teaching,
teach children to love learning

Tell me and I forget.
Teach me and I remember.
Involve me and I learn.

It is not about teaching the child to read,
it is about teaching the children to love to read.

When I look at my students
I see unlimited possibilities.

The best teaches teach from the heart
not from the book.

Good teachers know 
how to bring out the best in the students.

Teaching kids to count is fine,
but teaching them what counts is best.

The future of the world
is in my classroom today.

Today you lead the students.
Tomorrow your students will lead the world.

From small beginnings
come great things.

*          *          *
They guide us....
They support us....
They inspire us....
They teach us....
Today is the day to thank them and say

Happy Teachers` Day

Monday, 5 September 2016

Beautiful Garden in Kshetra School

బ్లేక్‌బోర్డు, టీచర్ మొఖం, చదువుతున్న పుస్తకంలో పేజీలూ తప్పించి... పచ్చని మొక్కలు, గాలికి అల్లల్లాడుతున్న లేత ఆకులు, నీటి గలగలల శబ్దం, అప్పుడప్పుడూ కువకువమని ఎగిరే పిచ్చుకల సందడి... ఏవీ అనుభవమవ్వడం లేదు ఇప్పటి విద్యార్థులకి. అటువంటి లోటు క్షేత్ర స్కూల్ పిల్లలకి ఉండకూడదని కొంచెం కష్టమైనా మొదటి, రెండవ ఫ్లోర్‌లలో అందమైన మొక్కలు, పచ్చికలతో చక్కని గార్డెన్ ఏర్పాటు చేశాం. చిన్న నీటి పాత్ర, మురళీ వాయిస్తున్న వేణుగోపాలుడి విగ్రహం గార్డెన్ ఏంబియన్స్‌ని చక్కగా ఎలివేట్ చేశాయి.  తూర్పువైపు క్లాస్‌రూముల్లో సూర్యకిరణాలు పడే చోటులో తరగతికి రెండేసి పాం రకపు మొక్కలని ఉంచాం. తరగతి గదుల్లో గాలి రీసైకిల్ కావడానికి ఈ ఏర్పాటు ఎంతో సహాయపడుతుంది. ఆగస్టు పదిహేనవ తారీకున గార్డెన్‌ని చూసిన విద్యార్థులూ, వాళ్ళ తల్లితండ్రులూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. క్షేత్ర స్కూల్‌లో గార్డెన్ ఫోటోలు కొన్ని మీకోసం...




Related Posts Plugin for WordPress, Blogger...