Tuesday, 6 September 2016

Eco Ganesha 2016

వినాయక చవితి - ఇంటిలో వినాయక వ్రతం చేసుకోవడం, కూడలి కూడలికీ వినాయక పందిళ్ళల్లో ఆకర్షణీయమైన వినాయక ప్రతిమలని నిలబెట్టడం, తొమ్మిదిరోజుల కోలాహలం, చివరిరోజు వినాయక నిమజ్జనం... పండుగ కోలాహలం ఎంతో బాగుంటుంది. కానీ ప్లాస్టరాఫ్ పారిస్‌తో తయారుచేసి, రసాయనిక రంగులు అద్దిన ప్రతిమలని నిమజ్జనం చెయ్యడం వల్ల నీటి కాలుష్యం జరుగుతుందని పర్యావరణ వేత్తలు చెపుతూ వస్తున్నారు. దీనివల్ల మట్టితో ప్రతిమలు తయారుచెయ్యడానికి ప్రాముఖ్యత పెరిగింది. `మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం` అనే నినాదం ఊపందుకొంది. `నేను సైతం` అన్నట్టు... మన క్షేత్ర స్కూల్ కూడా విద్యార్థుల్లో అవగాహన పెంచడానికి `ఎకో గణేశా` కార్యక్రమాన్ని నిర్వహించింది.

నాణ్యమైన నల్ల మట్టిని తెప్పించి, వినాయక ప్రతిమలని ఎలా తయారు చెయ్యాలో విద్యార్థులకి నేర్పించి, బొమ్మలు చెయ్యడానికి స్థలాన్ని కేటాయించి... ది స్పిరిట్ ఆఫ్ మేకింగ్ వినాయకా ని వాళ్ళల్లో నింపడం జరిగింది. ఏకాగ్రతతో క్షేత్రా స్కూల్ చిన్నారులు బుజ్జి, బుజ్జి వినాయకులని తయారు చెయ్యడం చూస్తుంటే ముచ్చటేసింది. కావాలంటే మీరూ చూడండి.



























No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...